ఓం నమోనారాయణాయ
భారతదేశంలొ ఆలయాలు మూడువిధములుగా ఉండును
1)దేవస్థానములు:
ఇందు భగవంతుడు సశరీరముగా అనగా ఆధ్యాత్మిక శరీరముగా వీరికి త్లిదండ్రులు చావుపుట్టుకలు ఉండవు అనగా అమృతము తాగినవారు వీరు జన్మతీసుకోకుండా దైవకార్యము కొరకు భూలోకమున అవతరించుదురు అనగా మనిషి లాగానే ఉందురు మరియు మనిషివలె ఆకలిదప్పులు వీరికి ఉండును కొంత కాలము అలా నివశించి శిలారూపమును పొందుదురు.
శ్రీఅనంతపదమనాభ స్వామివారు తప్ప మిగిలిన దేవతలందరు ఈకోవకు చెందుదురు శ్రీఅనంతపద్మనాభ స్వామివారు నిక్షిప్త శరీరము అనగా విశ్వములొ మోదటి మనిషి.
సశరీరం పొందిన దైవం వెలసియున్న శిలారూప ప్రతిమను "స్వయంభు" అందురు వీరు వెలసియున్న ఆలయాలను "దేవస్థానములు" అందురు అనగా స్వయంభుఆలయం, కలియుగ ప్రారంభమున శ్రీవేంకటేశ్వర స్వామి తిరుమల కొండపై ఇలావెలసిన దైవం.
ఈదైవమును "మూలవిరాట్" అందురు మిగిలిన ఆలయాలలోని దైవాలను "శిలారూపవిరాట్" అందురు శ్రీకాణిపాక వినాయకస్వామి ఇందుకు ఉదాహరణ.
2)దేవాలయాలు:
ఇందు జీవశరీర దైవం వెలసియండును అనగా వీరు అమృతము తాగినవారే అయిన జన్మతీసుకుని దైవకార్యము కొరకు భూలోకమున ఉందురు వీరు మనిషె వీరు జీవించిన కాలములొ వీరు చేసిన దైవకార్య ఆచరణకు గుర్తుగా సాధారణ మనుషులు వీరి శిలారూప ప్రతిమను ఏర్పాటు చేయుదురు వీరితొపాటు ధైవికఅంశ గా అవతరించిన వారు అనగా విశిష్టాద్వైత మనుషులు దైవకార్య ఆచరణకు గుర్తుగా కూడా శిలారూప ప్రతిమను ఏర్పాటు చేసి ఆలయం కట్టి కొలుతురు వీటినే దేవాలయాలు అందురు. ఇక్కడ దైవ ప్రతిరూపమును శిలారూపవిరాట్ అందురు.
3)గుడి:
ఇందు సాధారణ మనుషులు దేవునుని పూజచేయుటకు శిలారూప ప్రతిమలు ఏర్పాటు చేసి ఆలయాలు కట్టి కొలుతురు వీటిని గుడి అందురు పైరెండిటిని కూడా గుడి అనివచ్చు కానీ వాటి విశేషములు పైన తెలిపిన విధముగా ఉండును. ఇక్కడ దైవ ప్రతిరూపమును శిలారూపవిరాట్ అందురు. ఇక్కడ దైవ ప్రతిమకు ప్రాణప్రతిష్ఠ చేయుదురు.
కొన్ని భారతదేశము లోని ఆలయాలను ఇప్పటికి గుడి అని చెప్తుఉన్నారు ఇకమీదట పైవిధముగా మార్చాలని మనవి.