Loading...

ఓం నమోనారాయణాయ

 

దంతెవాడ

 

దంతెవాడ పట్టణము నందు శ్రీదంతేశ్వరీ దేవి కొలువై యున్నారు ఇక్కడ సతీదేవి దంతములు పడినవి దీని సంకేతముగానే ఈపట్టణానికి దంతెవాడ అనుపేరు వచ్చినది మరియు ఇక్కడ కొలువైన దేవతను దంతేశ్వరీ దేవి అని అందురు దీనికి కారణం అమ్మవారు పతికి అనగా శివుడు కి జరిగిన అవమానం భరించలేక ధక్షయఙ్ణములొ అగ్నికి ఆహుతీ అయినది ఇది భరించలేని శివుడు అమ్మవారి మృతదేహముతొ దక్షుని యఙ్ణమున భీభత్సమును సృష్ఠించెను ఇది చూసిన విష్ణుమూర్తి అమ్మవారి మృతదేహమును తన విష్ణుచక్రముతొ ఖండములుగా చేసెను అందులొ ఒక ఖండం అనగా దంతములు దంతెవాడ నందు పడినది దీనికి సంకేతముగానే ఈపట్టనమునకు దంతెవాడ అను పేరువచ్చినది ఇక్కడ వెలసియున్న దైవమును అనగా అమ్మవారిని దంతేశ్వరీ దేవి అని అందురు.

 

దంతములు మన్నికకు సంకేతము ఇక్కడ అనగా దంతెవాడ లోని దంతములు శ్రీకాళహస్తి యందు వాయులింగుని లింగముపై నున్న ఏనుగు దంతములు మన్నికకు సంకేతం అనగా ఇదే వాయులింగుని ఏనుగు దంతములక్రింద సాలిగూడు ఉండును అనగా సాలిగూడు మనం అన్న జీవనమును సూచించును. మనం అని జీవించిన ఈభూగోళపై మనుష్యుల జీవనం దీర్ఘకాలిక మన్నిక అనగా మానవజాతి అంతరించకుండా ఉండును.